* నేనే మార్గం...."యేసు"
" మతం ముదిరితే ఉన్మాధము, ఉన్మాధం ముదిరితే స్మశానము" అని అన్నరు ఒక దైవజనుడు;
అవును. . . . నేడు లోకంలో చాలామంది మతం మత్తులో ఉన్మాధులుగా మరి తమ ప్రాణాలు తీసుకుంటున్నారు లేదంటే ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. ఏంత ఘోరం అండీ అది.
మతం మత్తు మనిషిని మృగంగా మారుస్తుంది. . . .అవును.
మరి క్రేస్తావులు ఏ మతానికి చెందినవారు. . . . ?
క్రేస్తావులు మతానికి సంభందించిన వారు కాదు.
క్రేస్తావులు మహిమాన్వితుడైన యేసుక్రిస్తుకి సంభందించిన వారు.
క్రేస్తవత్వం మతం కాదు. . . .
యేసుక్రీస్తు మతనాయకుడు కానేకాదు. . . .ఇది గమనించాలి.
ఈ ప్రముక్యమైన విషయం మరచిపోయి కొందరు పాస్టర్ లు " యేసయ్య మతాన్ని నమ్మండి,మా మతంలోకి మారండి, క్రెస్తవ మతం పుచ్చుకోండి" అని బోధిస్తుంటారు. ఇలాంటి వారివల్లే సువర్తకి అంతరాయాలు వస్తున్నాయి, క్రేస్తావులుపై మత మార్పిడి కేసులు వచ్చిపడుతున్నాయి. . . .
నా ప్రియ స్నేహితులారా.... గమనించండి.
వాక్యం ఏమని చెబుతుంది. . . . ?
యేసయ్య మతాన్ని పొందండి అని చెబుతుందా. . . . ?
ప్రవక్తయైన బాప్తిసమిచ్చు యోహాను ఇలా బోధించాడు " మీరు మరుమనస్సు పొందుడి" అని. (మత్తయి 3:2).
ఆ తరువాత వచ్చిన నా రక్షకుడైన యేసు ఇలా బోధించాడు " మీరు మరుమనస్సు పొందుడి" అని. (మత్తయి 4:17)(మార్కు 1:15).
ప్రత్యేకంగా కూడా నికోదైముతో యేసు ఇలా బోధించాడు " నూతనంగా మారండి, మీరు మరుమనస్సు పొందుడి" అని. (యోహాను 3:1-7)
ఆ తరువాత యేసు 12 శిష్యులు ఇలా బోధించారు " మీరు మరుమనస్సు పొందుడి" అని. (మార్కు 6:12).
ఆ తరువాత పేతురు ఇలా బోధించాడు " మీరు మరుమనస్సు పొందుడి" అని. (అపో!!కా 2:38).
ఆ తరువాత పౌలు ఇలా బోధించాడు " మీరు మరుమనస్సు పొందుడి" అని. (అపో!!కా 26:20).
చివరికి ప్రకటనగ్రంథము సంఘములతో ఏమని బోధిస్తుంది " మీరు మరుమనస్సు పొందుడి" అని.( ప్రకటన 2:5)(2:16)(2:22)(3:3).
నూతన నిబంధన ప్రారంభంనుండి చివరవరకు ఒకే బోధ " మీరు మరుమనస్సు పొందుడి". అని.
" Bible " ఉద్ధేశం ఒక మనిషి యొక్క మతం మార్చటం కాదు, ఒక మనిషి యొక్క మనస్సు మార్చటం.
సూటిగా చెప్పాలి అంటే "మతం" అనే మాటతో క్రేస్తవునికి ఏ సంబంధంలేదు. లేనేలేదు.
ఇది మనం జాగ్రతగా గుర్తుపెట్టుకోవలసిన విషయం. ప్రతేకంగా సువార్త పనిలో ఉన్నవారు.
అవును. . . ." Bible " ఉద్ధేశం - ఒక మనిషి యొక్క మతం మార్చటం కాదు, ఒక మనిషి యొక్క మనస్సు మార్చటం.
యేసుక్రీస్తు ఇలా అన్నారు (యోహాను 14:6) " నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకురాడు" అని.
చెయ్యవలసిన తప్పులు చేసేసి వాటిని కడుగుకొనుటకు ధనధర్మాలు చేసేసి పుణ్యం ముటకట్టుకుందం, పరలోకం వెల్లిపోదాం అనుకుంటే కుదరదు అంట. మన స్వనీతిని దేవుడు మురికి గుడ్డలా తిసి పక్కన పడేస్తాడు. దేవునిని చేరాలన్నా, ఆ పరలోకంలో దేవునితో నివసించాలన్నా, చేసిన ప్రతి పాపం పోయి పరిశుద్ధంగా మరి దేవునితో సత్- సంబంధంకలిగి ఉండాలన్నా ఒకే ఒకే మార్గం ఉంది; అది "రక్షకుడైన యేసుక్రీస్తు".
మరి ఏ నామంలోను రక్షణ లేదు, రాదు. యేసుక్రీస్తు ద్వారానే మనం పరలోకం చేరగలము, ప్రముక్యంగా పాపం నుండి, శాపం నుండి విడుదల పొందగలము.
* యేసు ఒక మతం కాదు; యేసు మనకున్న ఒకేఓక రక్షణమార్గం.
* యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం.
హల్లెలూయ. . . .
మన రక్షకుడైన యేసుక్రీస్తును గూర్చిన ఈ సువార్త ప్రకారముగాను మిమ్మును వాక్యంలో స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి, యేసుక్రీస్తు ద్వారా, నిరంతరము మహిమకలుగునుగాక.
ఆమేన్. ఆమేన్. ఆమేన్.
No comments:
Post a Comment